ఇందూరులో బోనమెత్తిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

కలం, నిజామాబాద్ బ్యూరో: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) నిజామాబాద్‌లో బోనం ఎత్తుకున్నారు. నిజామాబాద్ పాత కలెక్టరేట్ ప్రాంగణంలో టీఎన్‌జీఓఎస్ (TNGOS) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆషాఢ మాసం బోనాల మహోత్సవాల్లో మహేష్ కుమార్ గౌడ్  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal) కూడా పాల్గొని భక్తులతో కలిసి బోనాల వేడుకల్లో సందడి చేశారు. అనంతరం నిర్వాహకులు మహేష్ కుమార్ గౌడ్‌(Mahesh Kumar Goud)ను ఘనంగా సన్మానించారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ఇలాంటి వేడుకలు సమాజంలో ఐక్యతను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు కేశ వేణు, శేఖర్ గౌడ్, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, రామకృష్ణ, దయాకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఎన్‌జీఓఎస్ ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read : సారీ సార్.. ప్రధాని మోదీకి జుకర్‌బర్గ్ క్షమాపణ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>