బ‌డికి పోవాలంటే సాహ‌సం చేయాల్సిందే!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఆ రాష్ట్రంలో పేరుకేమో డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్.. కానీ, పిల్ల‌లు బ‌డికి పోవాలంటే ప‌డుతున్న క‌ష్టాలు వ‌ర్ణ‌ణాతీతం. స్కూల్‌కు వెళ్లేందుకు పిల్ల‌లు బ్రిడ్జిపై జంప్ చేస్తూ ప్ర‌మాద‌క‌రంగా వెళ్తున్న ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇది మ‌ధ్యప్ర‌దేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోని విదిషా జిల్లాలో ఉన్న క‌క్రౌవీ గ్రామానికి చెందిన వీడియో. ఈ గ్రామంలోని పిల్లలు స్కూల్‌కి వెళ్లాలంటే క‌నీసం 10 నుంచి 15 కిలో మీట‌ర్లు ప్ర‌యాణించాలి. అయితే ఈ దూరాన్ని త‌ప్పించుకునే షార్ట్ క‌ట్ మార్గం ఒక‌టి ఉంది. అదే బెట్వా న‌దిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి రూట్‌.

ఎక్కువ దూరం ప్ర‌యాణించ‌లేక విద్యార్థులు న‌ది పై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పిల్ల‌ర్ల గుండా స్కూల్‌కు వెళ్తున్నారు. ఒక పిల్లర్ నుంచి మరో పిల్లర్ పై దూకుతూ ప్రయాణిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై విదిషా జిల్లా అధికారులు స్పందించారు. విద్యార్థులకు సైకిళ్లు అందించి సురక్షితమైన మార్గంలో పాఠశాలకు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నదిపై తాత్కాలిక వంతెన నిర్మాణానికి ప్రతిపాదన‌లు పంపినట్లు వెల్లడించారు. అలాగే ప్రభావిత గ్రామాలకు సమీపంలో కొత్త పాఠశాల ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. గత నాలుగైదేళ్లుగా ఇదే విధంగా నదిని దాటి స్కూల్‌కు వెళ్తున్నామని విద్యార్థులు చెప్తున్నారు. దీంతో ఇంతకాలం అధికారులు ఎందుకు స్పందించలేదని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్ప‌టికైనా త్వ‌ర‌గా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి విద్యార్థుల‌కు ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించాల‌ని కోరుతున్నారు.

Also Read : విద్యార్థులపై లాఠీచార్జ్.. కేంద్రానికి సుప్రీంకోర్టు హెచ్చరిక

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>