హైడ్రా క‌మిష‌న‌ర్‌ రంగ‌నాథ్ సంత‌కం ఫోర్జ‌రీ

క‌లం, వెబ్‌డెస్క్‌: హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ (HYDRAA Commissioner Ranganath) సంత‌కం ఫోర్జ‌రీ చేసిన ఘ‌ట‌న‌లో ఎనిమిది జూనియ‌ర్ కాలేజీల‌పై కేసులు న‌మోద‌య్యాయి. ఫైర్ ఎన్‌వోసీ స‌ర్టిఫికెట్ల కోసం నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా స‌ద‌రు కాలేజీలు రంగ‌నాథ్ సంత‌కం ఫోర్జరీ చేశాయి. ఇంట‌ర్‌మీడియ‌ట్ అధికారుల‌కు వ‌చ్చిన సుమారు 76 ఫైర్ ఎన్‌వోసీ స‌ర్టిఫికెట్ల‌ను ప‌రిశీలిస్తుండ‌గా ఈ ఫోర్జ‌రీ బాగోతం వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం 8 కాలేజీలు వెలుగులోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ ఈ కాలేజీల సంఖ్య వంద వ‌ర‌కు ఉండ‌వ‌చ్చ‌ని అధికారులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై లేక్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. ఎనిమిది కాలేజీల గుర్తింపు ర‌ద్దు చేయాల‌ని తెలంగాణ ఇంట‌ర్ బోర్డుకు అధికారులు సూచించారు.

ఆ ఎనిమిది కాలేజీలు ఇవే..

అధికారులు ఫిర్యాదు చేసిన ఎనిమిది కాలేజీల్లో బ‌ర్క‌త్‌పురాలోని హైంద‌వి కాలేజ్‌, ఎస్ఆర్ న‌గ‌ర్‌లోని రెసోసెన్స్ కాలేజ్‌, మెహిదీప‌ట్నంలోని ప్రియాంకా కాలేజ్‌, విద్యా న‌గ‌ర్‌లోని మ‌ద‌ర్స్ గాల్స్ కాలేజ్‌, చంద్ర‌యాణ‌గుట్ట‌లోని శ్రీచైత‌న్య జూనియ‌ర్ కాలేజ్‌, చిక్క‌డ‌ప‌ల్లిలోని న్యూ ఎరా జూనియ‌ర్ కాలేజ్‌, శివ‌రాంప‌ల్లిలోని షాహీన్ జూనియ‌ర్ కాలేజ్‌, తెల్లాపూర్ లోని వ‌శిష్ట జూనియ‌ర్ కాలేజీలు ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>