ఇరాన్‌పై అమెరికా కొత్త వ్యూహం!

కలం, వెబ్ డెస్క్: యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా (US Iran War) ప్రతిపాదించిన షరతులకు ఇరాన్ అంగీకరించకపోవడంతో వాషింగ్టన్ కొత్త వ్యూహాలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. టెహ్రాన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు సంప్రదాయేతర వ్యూహాలను అన్వేషించాలని భావిస్తున్నది. ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ తమ బలగాలకు ఈ-మెయిల్ పంపినట్టు సమాచారం. ఇప్పటివరకు ఇరాన్‌పై అమలు చేసిన వ్యూహాన్ని సెంట్రల్ కమాండ్ అధికారులు రివ్యూ చేస్తున్నారు.

టెహ్రాన్‌ను చర్చలకు తీసుకొచ్చేందుకు అమెరికా కొన్ని వారాలుగా వైమానిక దాడులు కొనసాగిస్తున్నప్పటికీ, అణు ఒప్పందంపై పురోగతి కనిపించకపోవడంతో మరింత కఠిన వైఖరి అవలంబించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులు చేపడతామని హెచ్చరించారు. అయితే సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ జోక్యంతో ఆ చర్యలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.
ఇరాన్ కు ఇదే చివరి అవకాశం

ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఇరాన్‌కు ఇదే చివరి అవకాశమని ట్రంప్ హెచ్చరించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోకపోతే రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన దాడులకంటే తీవ్ర స్థాయిలో సైనిక చర్యలకు అమెరికా సిద్ధంగా ఉందన్నారు. యుద్ధం ముగింపునకు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగించాలని ఇరాన్‌తో పాటు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ చేసిన విజ్ఞప్తి మేరకు భారీ దాడిని నిలిపివేశామని తెలిపారు.

ప్రస్తుతం ఇరుదేశాల ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మరోవైపు ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున కువైట్‌, ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ డ్రోన్ దాడులు నిర్వహించినట్లు సమాచారం. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>