కలం వెబ్ డెస్క్ : నేడు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(Telugu Film Chamber) ఎన్నికలు(elections) జరుగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరుగనుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో మన ప్యానెల్(చిన్న నిర్మాతలు), ప్రోగ్రెసివ్ ప్యానెల్(పెద్ద నిర్మాతలు) మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ప్రోగ్రెసివ్ ప్యానెల్‌ను బలపరుస్తున్న వారిలో దిల్‌రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు తదితరులున్నారు. ఇక చదలవాడ శ్రీనివాసరావు, సి.కళ్యాణ్, ప్రసన్నకుమార్ మన ప్యానెల్‌కు మద్దతిస్తున్నారు. ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.


