కలం, వెబ్ డెస్క్: సమైక్యాంధ్రప్రదేశ్ లో తెలుగు జాతి కోసం పాటుపడ్డామని.. రెండు రాష్ట్రాలను తామే అభివృద్ధి చేశామని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. రాష్ట్ర సమగ్ర సమాచారం ప్రజలకు తెలపడం ముఖ్యమని పేర్కొన్న సీఎం.. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రజలకు ఆర్థిక పరిస్థితిపై ఇప్పటి వరకు ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశామని వివరించారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రోగ్రెస్ రిపోర్టులు ప్రజలకు తెలియజేయాలని అభిప్రాయపడ్డారు.
చెప్పినన్నీ చేస్తున్నాం..
ఉమ్మడి ఏపీలో తలసరి ఆదాయం రూ.95,231గా ఉండేదని.. విభజన తర్వాత తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104.. ఏపీలో తలసరి ఆదాయం రూ.93,903 గా ఉందని తెలిపారు. ఈ పరిస్థితుల నుంచి సీఏజీఆర్ 13.5 శాతం వృద్ధి స్థాయికి చేరామని అన్నారు. 2019-24 మధ్య జీఎస్ డీపీ వృద్ధిరేటు 3.18 శాతం తగ్గిందని స్పష్టం చేశారు. వృద్ధిరేటు తగ్గడంతో రూ.6.94 లక్షల కోట్ల నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. 2019లో ఇండస్టీలు బయటకు వెళ్లిపోయాయని విమర్శించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఏం చెప్పిందో అవన్నీ అమలు చేస్తున్నామని అన్నారు.
పంపకాలు సరిగా జరుగలేదు..
రాష్ట్ర విభజన సమయంలో ఆస్తుల పంపకం సరిగా జరగలేదని అన్నారు.. 2019 తర్వాత వైసీపీ హయాంలో రాష్ట్రం విధ్వంసానికి గురైందని విమర్శించారు. 2024లో కూటమి ప్రభుత్వం రాగానే బ్రాండ్ ఏపీని పునరుద్ధరించాముని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం 2025-26లో పది సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్ 2047 తయారు చేసిందని సీఎం (Chandrababu) వివరించారు. అటు వివిధ అంశాలకు సంబంధించి పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేస్తున్నామని అన్నారు.
‘భోగాపురమే’ ఉదాహరణ..
ప్రగతిశీల విధానాలతోపాటు క్వాంటం లాంటి టెక్నాలజీపై దృష్టి పెట్టామన్నారు. ఒక ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేస్తే ఎలా ఉంటుందో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయమే ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. 2024 నుంచి ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మారిపోయిందని సీఎం తెలిపారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అని అని కొనియాడిన సీఎం.. రాజధానికి నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు.
Also Read : బీజేపీకి షాక్.. నేషనల్ చీఫ్ ఇలాకాలో పీకే పాగా
Follow Us On : WhatsApp

