పోలీస్ స్టేషన్ ఆవరణలో వివాహిత ఆత్మహత్యాయత్నం

కలం, హనుమకొండ: హనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీస్ స్టేషన్ (Kamalapur Police Station) ఆవరణలో మంగళవారం ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం, కమలాపూర్‌కు చెందిన అన్నదమ్ములు కంది రమేశ్, శ్రీనివాస్ మధ్య జరిగిన గొడవలో శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై విచారణ నిమిత్తం పోలీసులు రమేశ్‌తో పాటు అతని కుమారుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రమేశ్ భార్య కంది శృతి రాత్రి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఓ రసాయనం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు 108 అంబులెన్స్‌లో ఆమెను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>