సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

కలం, వెబ్ డెస్క్ : వివాహంతో సమానమైన సహజీవనం సంబంధాలపై భారత సుప్రీం కోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది. సహజీవనంలో ఉన్న మహిళలకు గృహహింసకు గురైతే ఐపీసీ సెక్షన్ 498ఏ వర్తిస్తుందని స్పష్టం చేసింది. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టంలో మార్పులు జరగాలని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. లివ్ – ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న మహిళలకు గృహహింస చట్టం వర్తిస్తుందని సోమవారం తీర్పు వెలువరించింది.

498ఏ ప్రకారం సహజీవనంలో భాగస్వామిపై కూడా గృహ హింస, వేధింపుల కింద కేసు నమోదు చేయవచ్చని తేల్చిచెప్పింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న మహిళకు గృహహింస నుంచి రక్షణ విషయంలో తేడా చూపడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కు విరుద్ధమని జస్టిస్ సంజయ్ కరాల్ జస్టిస్ నొంగ్మీకాపం కోటేశ్వర్ సింగ్ లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>