కలం, వెబ్ డెస్క్ : ఆంధప్రదేశ్ లో ప్రారంభమైన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య క్రెడిట్ వార్ కొనసాగుతోంది. భోగాపురం ఎయిర్ పోర్టు తమ కృషి వల్లే వచ్చిందని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే.. తమ అధినేత వల్లే భోగాపురం ఎయిర్ పోర్టు అందుబాటులోకి వచ్చిందని వైసీపీ నేతలు అంటున్నారు. తన వల్లే భోగాపురం ఎయిర్ పోర్టు కల సాకరమైందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై మంత్రి సంధ్యారాణి (Minister Sandhya Rani) సంచలన వ్యాఖ్యలు చేశారు.
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కొబ్బరికాయ కొట్టింది, గుమ్మడికాయ కొట్టింది సీఎం చంద్రబాబేనని ఆమె అన్నారు. ఈ క్రమంలోనే భోగాపురం ఎయిర్ పోర్టులో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్న వైసీపీ అధినేతకు ఏమైనా సిగ్గు, బుద్ధి ఉందా? అంటూ నిలదీశారు. మీ దగ్గర ఉన్న క్రెడిట్ గొడ్డలే అని ఎద్దేవా చేశారు. రిమాండ్ లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ములాఖత్‌లో కలిసేందుకు వెళ్లిన జగన్.. అప్పలరాజు కుమారుడు 18 ఏళ్ల పిల్లాడు?, అతను పొరపాటున వయసైపోయిన 45 ఏళ్ల వ్యక్తి ని యాక్సిడెంట్ చేస్తే రాజకీయం ఏంటి ? అనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. 45 ఏళ్ల వ్యక్తి చనిపోతే అతనికి వయసైపోయిందని జగన్ అనడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. కనీసం అతని కుటుంబాన్ని జగన్ పరామర్శించలేదని ఫైర్ అయ్యారు.

