కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో రోజురోజుకూ దారుణాలు పెరిగిపోతున్నాయి. భార్యలపై అఘాయిత్యాలు నిత్యం జరుగుతూనే ఉన్నా.. ఏదోఒక చోట హింసాత్మక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. జనగామ (Jangaon) జిల్లా బచ్చన్నపేట మండలం ఓబుల కేశవపురం గ్రామంలో (Obul Keshavapuram Horror) జరిగిన ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశారు. భార్య, కాళ్ళు చేతులు విరిచి ఘోరంగా కొట్టి.. ఆమె వద్దనుంచి పిల్లలను ఎత్తుకుపోయాడో దుర్మార్గుడు.
ఓబుల కేశవపురం గ్రామంలోస్థానికంగా నివసిస్తున్న మహేందర్ రెడ్డి, మాధవి అనే దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. కొంతకాలం సజావుగా సాగిన వీరి దాంపత్యంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భర్త మహేందర్ మరో మహిళతో వివాహేతరం సంబంధం ఏర్పడిందని తెలుసుకున్న భార్య మాధవి.. అతడిని నిలదీసింది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య గొడవ పచ్చగడ్డి వేస్తే.. భగ్గుమనేలా తారాస్థాయికి చేరింది. తీవ్ర ఆగ్రహానికి గురైన మహేందర్.. భార్యను ఘోరంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా ఆమె కాళ్లు, చేతులు విరిచేసి.. ఇద్దరు పిల్లల్ని ఎత్తుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.
భర్త తనపై చేసిన దాడికి తీవ్ర మనస్తాపంతో కుమిలిపోయిన సదరు మహిళ.. స్థానిక పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. భర్త తనని చంపాలని చూశాడని.. కాళ్లు, చేతులు విరిచేశాడని మాధవి పిర్యాదులో పేర్కొంది. తనను కొట్టి ఇద్దరు పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయాడని ఫిర్యాదులో రాసుకొచ్చింది.

