రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు.. ఐదుగురి మృతి

కలం, వెబ్ డెస్క్: రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులకు (Russia Ukraine War) పాల్పడింది. శనివారం రాత్రి, ఆదివారం భీకర దాడి చేసింది. ఈ దాడుల్లో పలు రష్యన్ ప్రాంతాలు పేలుళ్ల మోతతో దద్దరిల్లాయి. వేర్వేరు రష్యన్ అధికారిక వర్గాల నివేదికల ప్రకారం 5 నుంచి 8 మంది వరకు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులతో సమారా ప్రాంతంలోని అతి పెద్ద ఈ-కామర్స్ సంస్థ ‘వైల్డ్ బెర్రీస్’ గిడ్డంగిలో తీవ్రంగా మంటలు చెలరేగాయి. ఉక్రెయిన్ సైన్యం రాత్రి ఆపరేషన్‌లో ఎంగెల్స్ విమానాశ్రయాన్ని, సారటోవ్ పెట్రోల్ రిఫైనరీని లక్ష్యంగా దాడి చేసిందని రష్యా తెలిపింది. శనివారం రాత్రి నుంచి ఉక్రెయిన్ ప్రయోగించిన 635 డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని మాస్కో బలగాలు వెల్లడించాయి. గత నాలుగేళ్లుగా ఉక్రెయిన్, రష్యా వార్ కార్చిచ్చుగా రగులుతున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>