కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇటీవల ఇంజినీరింగ్ విద్యార్థులు, ఉపాధ్యాయులపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆరోపించారు. ఇంజినీర్లు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు దేశ సంపద అని, వారిని అవమానించేలా ముఖ్యమంత్రి మాట్లాడటం సరికాదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే యువతను బెదిరింపులతో అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ (Rahul Gandhi) పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. యువత గౌరవాన్ని కాపాడటంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు. రాహుల్ గాంధీ వెంటనే స్పందించి ఇంజినీరింగ్ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కోరారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కేయాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రమైన ప్రజా వ్యతిరేక ఉద్యమాలు చేపడతామని కేటీఆర్ (KTR) హెచ్చరించారు.
Also Read : కామన్వెల్త్ గేమ్స్ విందులో భారత్కు అవమానం.. లవ్లీనా ఆగ్రహం!
Follow Us On : WhatsApp

