కలం, నిర్మల్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలోని మామడ మండలం (Mamda Mandal) ఆరేపల్లి గ్రామ ఊర చెరువుకు ఆదివారం గండి పడింది. దీంతో చెరువులోని నీరు సమీప రైతుల పొలాల్లోకి చేరడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న సర్పంచ్ రాజవ్వ మల్లయ్య, నీటిపారుదల శాఖ ఏఈ విఠల్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం జేసీబీ సహాయంతో గండి పడ్డ ప్రాంతాన్ని అత్యవసరంగా పూడ్చివేసి చెరువు కట్టను బలోపేతం చేశారు. భారీ నష్టం జరగకముందే తాత్కాలిక మరమ్మతు పనులు పూర్తి చేయడంతో ప్రమాదం తప్పిందని సర్పంచ్ తెలిపారు. అధికారులు వెంటనే శాశ్వత మరమ్మతు పనులు చేపట్టి చెరువు కట్టను పటిష్టం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Also Read : నాలో అదే చూస్తారు.. సాయి పల్లవి ఓల్డ్ కామెంట్స్ వైరల్!
Follow Us On : WhatsApp

