రష్యాలో భారీ పేలుడు.. ముగ్గురి మృతి

కలం, వెబ్ డెస్క్: రష్యా రాజధాని మాస్కో (Moscow) పేలుడుతో దద్దరిల్లింది. కుద్రిన్స్కాయా స్క్వేర్‌లోని ఓ రెస్టారెంట్‌లో జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు మరణించగా.. 21 మందికి పైగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. యాంటీ టెర్రరిజం టీం ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిందని రష్యా ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.

రెస్టారెంట్‌లోకి ఓ అనుమానాస్పద మహిళ వెళ్తుండటాన్ని అధికారులు గుర్తించారు. ఆమెను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. గేటు వద్దనే ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఆమెతో పాటు సెక్యూరిటీ గార్డ్, మరో వ్యక్తి చనిపోయారు. దీంతో ఎవరా మహిళ.. ఎందుకు దాడికి పాల్పడింది.. దీని వెనుక ఉక్రెయిన్ హస్తం ఏమైనా ఉందా.. లేకపోతే ఉగ్రవాదుల పనా.. అనేది దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>