కలం, వెబ్డెస్క్: ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ (Muzaffarnagar)లో కన్వర్ యాత్ర (Kanwar Yatra)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శివనామ స్మరణతో భక్తిశ్రద్ధలతో సాగుతున్న కన్వర్ యాత్రికులను ఓ వేగంగా వచ్చిన పికప్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో పలువురు యాత్రికులకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వాహనంతో సహా ఘటనా స్థలం నుండి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి, గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న వాహనాన్ని, డ్రైవర్ను పట్టుకోవడానికి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. యాత్ర ప్రారంభానికి ముందే పోలీసులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశామని, ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ, ఈ ఘటనతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

