కలం వెబ్ డెస్క్ : ఆన్‌లైన్ గేమ్స్(Online Games), బెట్టింగ్ యాప్స్(Betting Apps) దుష్పరిణామాల గురించి పోలీసులు ఎంత అవగాహన కల్పించినా కొందరు వాటికి దూరం కాలేకపోతున్నారు. యువత ఈ దురలవాట్లకు బానిసై, ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా మరో యువకుడు ఆన్‌లైన్ గేమ్స్‌కు బలయ్యాడు. కుత్బుల్లాపూర్‌కు చెందిన రవీందర్(24) కొన్నేళ్లుగా బెట్టింగ్ యాప్స్, ఆన్‌లైన్ గేమ్స్ విపరీతంగా వాడుతున్నాడు. ఈ క్రమంలో పలుచోట్ల అప్పులు చేశాడు. ఆర్థిక ఇబ్బందులు తీవ్రం కావడంతో, అప్పులు కట్టలేక ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాశాడు. అలాగే సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాడు. బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పెట్టి భారీగా నష్టపోయాయని, తన చావుకు ఎవరూ కారణం కాదని వీడియోలో పేర్కొన్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సూరారం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. ఇలాంటి ఘటనలతోనైనా యువత ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్‌కు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.


