కలం, చండూరు(మర్రిగూడ): పంచాయతీ కార్యదర్శి (Panchayat Secretary) సంతకం ఫోర్జరీ చేసి భూమిని కబ్జా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నసంఘటన మర్రిగూడ మండల పరిధిలోని ఖుదాబక్ష్పల్లి (Khudabakshpally)లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఖుదాబక్ష్పల్లి గ్రామానికి చెందిన బొంత మల్లేష్ గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రసన్న బాబు సంతకాన్ని ఫోర్జరీ చేసి తప్పుడు ధ్రువపత్రాలను సృష్టించాడు. దీంతో గ్రామ కంఠానికి చెందిన 188 గజాల భూమిని కబ్జా చేసుకోవడానికి ప్రయత్నించాడు.
ఈ విషయం తెలుసుకున్న ఫోర్జరీ బాధితుడైన పంచాయతీ కార్యదర్శి ప్రసన్న బాబు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, అక్రమంగా గ్రామ కంఠభూమిని కబ్జా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న బొంత మల్లేష్ పై చర్యలు తీసుకోవాలని శనివారం మర్రిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఎస్సై రాంబాబు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Also Read : 6 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం: ఎమ్మెల్యే కుంభం అనిల్
Follow Us On : WhatsApp

