కలం, వెబ్ డెస్క్: నీట్ యూజీ–2026 (NEET UG 2026) అభ్యర్థుల కోసం స్టేట్ ర్యాంక్ జాబితాను డాక్టర్ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) వెల్లడించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్ కోసం అభ్యర్థులకు అవగాహన కోసమే తాత్కాలికంగా దీన్ని విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ జాబితాను మెరిట్ లిస్టుగా పరిగణించవద్దని కోరింది. త్వరలోనే పూర్తి స్థాయి వివరాలతో మరో ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేస్తామని వివరించింది. పూర్తి స్థాయి అధికారిక సమాచారం కోసం KNRUHS వెబ్‌సైట్‌ను పరిశీలిస్తుండాలని స్పష్టం చేసింది.
తాత్కాలిక మెరిట్ లిస్ట్ మాత్రమే..
నీట్ (NEET UG 2026) అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించి తాత్కాలిక మెరిట్ లిస్ట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. రూల్ నెంబర్, పేరు, కేటగిరీ, స్కోర్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. ఆలిండియా కోటా భర్తీలో భాగంగా అభ్యర్థి స్కోర్, రిజర్వేషన్, కమ్యూనిటీ సర్టిఫికేట్లను పరిశీలించాకే.. తుది మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. అయితే నీట్ నిబంధనల ప్రకారం ఎన్‌సీసీ, ఆంగ్లో ఇండియన్ వంటి ప్రత్యేక కేటగిరీలకు మాత్రం ప్రత్యేకంగా మరో మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు.
అక్కడ సీటు కావాలంటే ఎన్ని మార్కులు..
తెలంగాణ విద్యార్థులు రాష్ట్రంలోని ప్రముఖ కాలేజీల్లో వైద్య విద్య చదవాలని భావిస్తుంటారు. నిపుణుల సమాచారం ప్రకారం, గాంధీ మెడికల్ కాలేజీలో సీటు రావాలంటే కనీసం 685 ప్లస్ మార్కులు, ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీటు రావాలంటే 680 ప్లస్ మార్కులు, హైదరాబాద్ ఈఎస్ఐసీ కాలేజీలో సీటు రావాలంటే 675 ప్లస్ మార్కులు, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో 655 ప్లస్ మార్కులు రావాల్సి ఉంటుందని చెబుతున్నారు. తుది జాబితాలో ఈ అంచనాల్లో తేడాలు ఉంటాయని.. అవగాహన కోసం మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు.
Also Read : యువతకు అజిత్ దోవల్ కీలక సూచన
Follow Us On : WhatsApp

