కలం, నిర్మల్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో అక్టోబర్ – 2026లో నిర్వహించనున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్ష (Exam) లకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 17వ తేదీలోపు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించాలని నిర్మల్ (Nirmal) జిల్లా విద్యాశాఖ అధికారి దర్శన భోజన్న శనివారం తెలిపారు.
ఆగస్టు 24 వరకు ప్రతి పేపర్‌కు రూ. 25, ఆగస్టు 29వ తేదీ వరకు ప్రతి పేపర్‌కు రూ. 50 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించే అవకాశం ఉందన్నారు. తత్కాల్ పథకం కింద సెప్టెంబర్ 2వ తేదీ వరకు కూడా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు తమ పరీక్ష ఫీజును టాస్ వెబ్ సైట్, టీజీ ఆన్ లైన్ లేదా మీ సేవ కేంద్రాల ద్వారా చెల్లించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని డీఈవో తెలిపారు.
Also Read : నారాయణఖేడ్ ఫామ్ ల్యాండ్స్ మాయాజాలం!
Follow Us On: Sharechat

