కలం వెబ్ డెస్క్ : ఏపీలో 108 సేవల(108 Services) ఒప్పంద కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వానికి నోటీసులు(Strike Notice) పంపించారు. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చకపోతే జనవరి 12 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ప్రభుత్వ అనాలోచిన నిర్ణయాల వల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 108 సేవలను ప్రత్యక్షంగా నడపకుండా ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం వల్ల తాము నష్టపోతున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ప్రభుత్వం తరచూ నిర్వహణ సంస్థలు మార్చడం వల్ల తమకు రావాల్సిన గ్రాట్యూటీ, సెలవులు కోల్పోతున్నట్లు వాపోతున్నారు. అందరికీ ప్రభుత్వమే గ్రాట్యూటీ చెల్లించాలని, తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.


