కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలోని రేషన్ (Telangana Ration) కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, అలాగే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను దృష్టిలో ఉంచుకొని రేషన్ ఈ-కేవైసీ (E-KYC) పూర్తి చేసే గడువును ప్రభుత్వం పొడిగించింది. పౌరసరఫరాల శాఖ తాజా ఆదేశాల ప్రకారం, లబ్ధిదారులు తమ ఈ-కేవైసీని పూర్తి చేయడానికి ఆగస్టు 31 వరకు సమయం ఇస్తూ జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంకా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.
ఒకేసారి మూడు నెలల రేషన్..
దీనితో పాటు ప్రభుత్వం లబ్ధిదారులకు మరో కీలక ప్రయోజనాన్ని చేకూర్చింది. ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పొందే అవకాశాన్ని కల్పించింది. ఈ నిర్ణయం వల్ల వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ఉపశమనం లభించనుంది.
Read Also: లైంగిక వేధింపుల కేసు: హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే!
Follow Us On : WhatsApp

