మెటా ఇండియా హెడ్‌పై హైదరాబాద్‌లో కేసు!

కలం, వెబ్ డెస్క్ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లను అవమానిస్తూ సోషల్ మీడియా వేదికల్లో అనుచిత పోస్టులు పెట్టిన వారిపై తెలంగాణ పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. తెలంగాణ బీజేపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ అభ్యంతరకర పోస్టులను ప్రచారం చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు.

అయితే, ఈ కేసులో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి కంటెంట్‌ను నియంత్రించడంలో విఫలమైనందుకు గానూ, ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం ‘మెటా’ సంస్థ ఇండియా హెడ్‌ (Meta India Head)ను సైతం పోలీసులు ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. సైబర్ నేరగాళ్లతో పాటు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే సోషల్ మీడియా మేనేజ్‌మెంట్‌లపై కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయనే గట్టి సంకేతాన్ని ఈ ఘటన ద్వారా పోలీసులు పంపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>