కలం, నిర్మల్: ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసులు సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫిర్యాదులను సకాలంలో నమోదు చేసి కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా పోలీసు సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, ఖానాపూర్ సీఐ సత్యనారాయణ, ఎస్సై రాహుల్ గైక్వాడ్ పాల్గొన్నారు.

