సాయికృష్ణ లాకప్ డెత్ కేసు: సిట్ కస్టడీలోకి సీఐ నాగరాజు!

కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు (ఏ1)గా ఉన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ మాజీ సీఐ నాగరాజు (CI Nagaraju)ను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. సుప్రీంకోర్టు జారీ చేసిన తాజా ఉత్తర్వుల నేపథ్యంలో, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి చేరుకున్న సిట్ అధికారులు అక్కడి నుంచి ఆయనను విజయవాడకు తరలించారు.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నిందితుడు నాగరాజును విజయవాడలోని మేజిస్ట్రేట్ కోర్టులో సిట్ అధికారులు హాజరుపరిచారు. న్యాయస్థానం అనుమతితో నేటి నుంచి వారం రోజుల పాటు నాగరాజును సిట్ అధికారులు తమ కస్టడీలో ఉంచి లోతుగా విచారించనున్నారు. విజయవాడలోని సిట్ కార్యాలయంలో సిట్ చీఫ్, ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగనుంది. థర్డ్ డిగ్రీ ప్రయోగం, కేసు పూర్వాపరాలు, ఆధారాల ధ్వంసం వంటి అంశాలపై ఈ వారం రోజుల కస్టడీలో నిందితుడి నుంచి కీలక వివరాలను రాబట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>