కలం, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదోనీ, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల మెడికల్ కాలేజీలకు ప్రైవేట్ యాజమాన్యాలను ఆహ్వానించగా.. ఒక్క ఆదోనీ మెడికల్ కాలేజీకి కిమ్స్ బిడ్ వేసిందని న్యూస్ వచ్చింది. కొందరు పొలిటికల్ లీడర్లు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఈ విషయం వైరల్ కావడంతో కిమ్స్ హాస్పిటల్ (KIMS Hospital) స్పందించింది. తాము ఆదోనీ మెడికల్ కాలేజీకి బిడ్ వేయలేదని.. అవన్నీ ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేసింది. తాము ఎలాంటి పీపీపీ విధానంలో పాల్గొనలేదని తెలిపింది.
అలాంటి న్యూస్ అస్సలు నమ్మొద్దని కిమ్స్ హాస్పిటల్ (KIMS Hospital) యాజమాన్యం కోరింది. దీంతో ఈ న్యూస్ వైరల్ అవుతోంది. ఎందుకంటే ఇప్పటి దాకా మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో కిమ్స్ మాత్రమే బిడ్ వేసిందని న్యూస్ వచ్చింది. నాలుగు మెడికల్ కాలేజీలకు తొలిదశలో బిడ్లకు ఆహ్వానిస్తే.. ఒక్క బిడ్ కూడా రాలేదని ఇప్పుడు కిమ్స్ ప్రకటనతో తేలిపోయింది.
Read Also: త్వరలో బీజేపీలో చేరుతా: రాజాసింగ్
Follow Us On: Instagram


