కలం, వెబ్ డెస్క్: ఈతరం మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా.. వివిధ రంగాల్లో పనిచేస్తూ రాణిస్తున్నారు. ఉద్యోగాల కారణంగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓలా, ఉబర్ లాంటివి బుక్ చేసుకునేటప్పుడు అత్యధికంగా మగవారే పికప్ చేసుకుంటున్నారు. దీంతో ఎంతోమంది మహిళలు (Women Cab Drivers) ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ‘మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు’ రూపొందించింది. ఈ నిర్ణయంతో మహిళలు మహిళా డ్రైవర్లను ఎంచుకునే అవకాశం కల్పించింది.
మహిళలు ఆన్‌లైన్‌లో కారు లేదా బైక్‌ను బుక్ (Book) చేసుకోగానే యాప్‌లో ‘సేమ్ జెండర్’ డ్రైవర్ ఫీచర్ కనిపిస్తుంది. కొత్త నిబంధన ప్రకారం.. అన్ని క్యాబ్ సంస్థలు జెండర్ ఫీచర్‌ను చేర్చాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం దేశంలో మహిళా డ్రైవర్ల (Women Cab Drivers ) సంఖ్య 5శాతం కంటే తక్కువగా ఉంది. ఈ కొత్త నిబంధన అమలుకావడం అనేది సవాలుతో కూడుకున్నదని పలువురు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓలా, ఉబర్ సంస్థలు ఏవిధంగా సేవలందిస్తాయి, మహిళా డ్రైవర్లకు ఎదురుయ్యే ఇబ్బందులు చర్చకొస్తున్నాయి.
Read Also: వలసదారుల పిల్లలూ ప్రమాదమే.. ట్రంప్ సలహాదారు కీలక వ్యాఖ్యలు
Follow Us On: Pinterest


