కలం, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ (Stephen Miller) చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. వలసదారుల పిల్లల గురించి ఆయన సంచలన కామెంట్లు చేశారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వలసదారులు అంటేనే ట్రంప్ ఇంతెత్తున ఎగిరిపడుతున్నారు. అమెరికా ఫస్ట్ నినాదానికి కట్టుబడి ట్రంప్ పాలన కొనసాగుతోంది. అయితే తాజాగా ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ మరో వివాదాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. అమెరికాలోనే పుట్టి పెరిగిన పిల్లలు సైతం తమ దేశానికి ప్రమాదమే అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాలో పుట్టి పెరిగిన వలసదారుల పిల్లలు అమెరికా నుంచి ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారని.. వారితో అమెరికాకు పెద్దగా ప్రయోజనం లేదని ఆయన కామెంట్ చేయడం గమనార్హం. ఈ వ్యాఖ్యలతో కొత్త చర్చ మొదలైంది. వలసదారుల పిల్లల విషయంలోనూ ట్రంప్ సర్కారు కఠినంగా వ్యవహరించబోతున్నదా? అన్న చర్చ మొదలైంది. అమెరికాలో పుట్టిన వలసదారుల పిల్లలు అమెరికా చట్టాల ప్రకారమే ఆ దేశ పౌరులుగానే పరిగణించబడుతున్నారు. చట్టాల ప్రకారం వారికి అన్ని హక్కులు లభిస్తున్నాయి.
మిల్లర్ (Stephen Miller) మాటల వెనుక ఆంతర్యం ఏమిటి?
నిజమైన అమెరికన్లకు ఉన్న అన్ని హక్కులూ, ప్రభుత్వ ప్రయోజనాలు వీరికి వర్తిస్తున్నాయి. అయితే స్టీఫెన్ మిల్లర్ (Stephen Miller) మాట్లాడుతూ.. ‘వలసదారుల పిల్లలతో అమెరికాకు కలిగే ప్రయోజనం కంటే.. వారు పొందుతున్న లాభమే అధికం. నిజమైన అమెరికన్లకు ఇది నష్టం చేస్తోంది‘ అన్న అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. దీంతో ట్రంప్ ప్రభుత్వం వలసదారుల పిల్లల మీద కఠిన వైఖరి అవలంభించబోతున్నదా? వారికి హక్కులు, ప్రయోజనాలు దక్కకుండా ఏమైనా రూల్స్ తీసుకొస్తారా? అన్న చర్చ మొదలైంది.
మొదటి నుంచి ట్రంప్ వ్యతిరేకమే..
ట్రంప్ మొదటి సారి అధ్యక్షుడైనప్పుడు 2018లో వలసదారుల పిల్లలకు పౌరసత్వం లభించకుండా ఉండేలా ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకురావాలని ప్రయత్నించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ప్రతిపాదన దశలోనే ఆగిపోయింది. 2025లో రెండో సారి అధ్యక్షుడు అయ్యాక ట్రంప్ ‘ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 14160‘ పై సంతం చేశారు. చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలిక వీసాలపై ఉన్న వలసదారుల పిల్లలకు పౌరసత్వం దక్కకుండా అడ్డుకుంటుంది. ఈ ఆర్డర్‌ను కింది కోర్టులు తిరస్కరించాయి. దీంతో ఈ ఆర్డర్ అములుకు నోచుకోలేదు. ప్రస్తుతం ఆ దేశ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ విచారణ దశలో ఉంది. 2026 జూన్-జులై నాటికి తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది.
Read Also: వైభవ్ సూర్యవంశీకి ప్రతిష్టాత్మక పురస్కారం, రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డ్
Follow Us On: X(Twitter)


