కలం, వెబ్ డెస్క్ : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, జెన్ జీ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ కూతురు ఈ సంబరాల్లో భాగం అవడం ఆసక్తికరంగా మారింది. భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి (Aparajita Sarangi) కుమార్తె అర్చిత సచిన్ రహార్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.
ఎంపీ కూతూరు అర్చిత ధర్మేంద్ర ప్రధాన్ ఫోటోతో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో “నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థుల భారీ నిరసనల మధ్య ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు” అని రాసుకొచ్చారు. అలాగే, “తన మునుపటి పోస్ట్ ని తొలగించమని మా అమ్మకు చెప్పబోయే డీపీ (DP) పీఏకు ఒక మాట చెబుతున్నాను. శ్రమ పడకండి నేను ఈ స్టోరీని తొలగించను. జై జగన్నాథ్.. జై హింద్” అని మరో పోస్ట్ లో రాసుకొచ్చారు.
స్వయానా బీజేపీ ఎంపీ కూతురే ఈ విధంగా పార్టీ ప్రతిష్ఠను దెబ్బతిసేలా పోస్ట్ చేయడంపై ఆ పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉంటుందని బీజేపీ ఎంపీ కార్యాలయం వెల్లడించింది. రహార్ సోషల్ మీడియా పోస్ట్ ఎంపీ అపరాజిత సారంగి వివాదాల్లోకి నెట్టింది.
Read Also: పరీక్షల సంస్కరణలపై మోదీ కీలక ప్రకటన!
Follow Us On: Instagram

