కలం, అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలోని మధురానగర్ కాలనీలో దొంగతనం (Achampet Theft) జరిగింది. కాలనీలో నివాసం ఉంటున్న ప్రిన్సిపాల్ పాండు నాయక్ ఇంటిలో అద్దెకు ఉంటున్న శ్రీకాంత్ అనే వ్యక్తి రూమ్ లోకి దొంగలు ప్రవేశించి 1.5 గ్రాముల బంగారం మూడువేల నగదును దోచుకెళ్లినట్లు బాధితుడు శ్రీకాంత్ తెలిపాడు.
గత రెండు రోజుల క్రితం వేరే పని నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లగా ఈరోజు వచ్చి చూడడంతో ఇంటి తలుపులు ఘడియలు విరగగొట్టి లోపలికి ప్రవేశించినట్లు తెలిపారు. దొంగలు బీరువాను ధ్వంసం చేసి అందులో ఉన్న బంగారంతో పాటు 300 నగదును దొంగిలించుకు వెళ్లారని పేర్కొన్నారు. దొంగలు ఇంటిలోని వస్తువులన్నిటినీ చిందర వందర చేసి వెళ్లినట్లు తెలిపారు. ఈ మేరకు అచ్చంపేట ఎస్ఐకి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు క్లూస్ టీం ద్వారా దొంగల ఆనవాళ్లను సేకరించారు.

