కలం, మునుగోడు : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు అన్నారు. బుధవారం చండూరు మున్సిపాలిటీ (Chandur Municipality) ఆవరణలో 1,69,500 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను చండూరు మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, కౌన్సిలర్లు కలిసి ఆరుగురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. చెక్కులు అందుకున్న వారిలో చిలుకూరు శ్రీనివాసులు రూ.39వేలు, భూతరాజు లక్ష్మమ్మ రూ. 16వేలు, చొప్పరి నరసింహ రూ.40వేలు, గొర్లకొండ పవన్ కుమార్ రూ.26వేలు, ఖమ్మంపాటి శివమని రూ.22,500, బొమ్మ కట్టి లక్ష్మి రూ.26వేలు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కోడి సుష్మా వెంకన్న, కలిమికొండ పారిజాత జనార్ధన్, రుషిపాక వాసు, చేనేత సహకారం సంఘం అధ్యక్షులు పున్న ధర్మేందర్, కో ఆప్షన్ సభ్యులు కల్లెట్ల చంద్రకళ మారయ్య, ఖలీల్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు ఐతరాజు మల్లేష్, పన్నాల లింగయ్య, భీమనపల్లి శేఖర్, బొమ్మరబోయిన వెంకటేశం, కన్నెబోయిన నాగరాజు, బెల్లంకొండ శేకర్, గజ్జల కృష్ణారెడ్డి, కారింగు మల్లికార్జున్ పాల్గొన్నారు.

