కలం, వెబ్‌డెస్క్: ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) ఆధ్వర్యంలో జరిగిన జెన్ జీ పోరాటం దేశంలో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఏకంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక ఇదే స్ఫూర్తితో ముంబైలో మరో జెన్ జీ ఉద్యమం (Mumbai Gen Z Protest) ప్రారంభమైంది. ఆదివారం ఉదయం నుంచి వేలాది మంది యువత రోడ్లపైకి వచ్చారు.
శివాజీ పార్క్ వద్ద బ్యానర్లు, ప్లకార్డులతో భారీ ఎత్తున నిరసన చేపట్టారు. తాము ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సంతోషంగా లేమని యువత తెలిపారు. అసలు దేశంలో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జ్ ఎందుకు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

