వీడియో రిలీజ్ చేసిన మ‌హేశ్‌.. ఆ రూమ‌ర్ల‌కు చెక్‌..!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న స‌మ‌యంలో మ‌హేశ్ బాబు (Mahesh Babu) చుట్టూ రూమ‌ర్లు ముసురుకున్నాయి. ఈ రూమ‌ర్ల‌కు ఒక్క వీడియోతో మ‌హేశ్‌ చెక్ పెట్టేశాడు. ఘ‌ట్ట‌మ‌నేని ర‌మేష్ బాబు కుమారుడు జ‌య‌కృష్ణ (Jayakrishna) హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram) టైటిల్‌తో తెర‌కెక్కిన జ‌య‌కృష్ణ తొలి సినిమా ఈ నెల 30న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే మూవీ టీం ప్ర‌మోష‌న్లు కూడా స్టార్ట్ చేసేసింది. అయితే ఫ్యామిలీ నుంచి కొత్త హీరో ఎంట్రీ ఇస్తున్నా మ‌హేశ్ అస్స‌లు ఎక్క‌డా జ‌య‌కృష్ణ కోసం ప్ర‌చారం చేయ‌డం లేద‌ని, కార‌ణం ఏమిట‌ని సోష‌ల్ మీడియాలో చ‌ర్చ మొద‌లైంది.

మ‌హేశ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో వార‌ణాసి సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ షూటింగ్ ప‌నుల్లో భాగంగా మ‌హేశ్ ఎక్కువ‌గా విదేశాల్లోనే బిజిబిజీగా ఉంటున్నాడు. దీంతో రాజ‌మౌళి పెట్టిన రూల్స్ కార‌ణంగానే మ‌హేశ్ బ‌య‌ట క‌నిపించ‌డం లేద‌ని, అందుకే జ‌య‌కృష్ణ సినిమాకు ప్ర‌మోష‌న్ చేయ‌డం లేద‌ని టాలీవుడ్‌లో రూమ‌ర్లు చెల‌రేగాయి. ఈ రూమ‌ర్ల‌కు ఒక్క వీడియోతో మ‌హేశ్ చెక్ పెట్టేశాడు. శ్రీనివాస మంగాపురం మూవీని ప్ర‌మోట్ చేస్తూ నేడు స్పెష‌ల్ వీడియో రిలీజ్ చేశాడు.

ర‌మేష్ అన్న వాళ్ల అబ్బాయి జ‌య‌కృష్ణ శ్రీనివాస మంగాపురంతో సినిమాల్లోకి రావ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని మ‌హేశ్ (Mahesh Babu) అన్నారు. త‌మ కుటుంబం మొత్తం ఎంతో ఆతృత‌తో ఈ సినిమా విడుద‌ల కోసం ఎదురుచూస్తోంద‌న్నారు. సినిమా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాట‌లు చాలా బాగున్నాయ‌ని చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రూ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డి ప‌ని చేశార‌ని ప్ర‌శంసించారు. త‌న‌తో పాటు అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్ కూడా వైజ‌యంతి బ్యాన‌ర్ నుంచే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చార‌ని, ఇదే బ్యాన‌ర్‌లో జ‌య‌కృష్ణ మొద‌టి సినిమా రావ‌డం చాలా ల‌క్కీ అని మ‌హేశ్ అన్నారు. ఈ సినిమా గొప్ప‌ స‌క్సెస్ సాధించాల‌ని, జ‌యకృష్ణ‌ను అంద‌రూ ఆద‌రించాల‌ని ఆకాంక్షించారు.

Read Also: ఆస్ప‌త్రిలో గ‌బ్బ‌ర్‌సింగ్ న‌టుడు.. ఆదుకున్న మెగాస్టార్‌!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>