ఆస్ప‌త్రిలో గ‌బ్బ‌ర్‌సింగ్ న‌టుడు.. ఆదుకున్న మెగాస్టార్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఇటీవ‌ల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై ఆస్ప‌త్రిలో చేరిన గ‌బ్బ‌ర్ సింగ్ న‌టుడు ర‌మేష్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అండ‌గా నిలిచారు. ర‌మేష్‌ చికిత్స‌కు అన్ని విధాలా సాయం అందిస్తామ‌ని కుటుంబ‌స‌భ్యుల‌కు హామీ ఇచ్చారు. ర‌మేష్ భార్య‌కు రూ.3 ల‌క్ష‌ల చెక్కును అంద‌జేశారు. ర‌మేష్ ప్ర‌స్తుతం అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆయ‌న ఆస్ప‌త్రి బిల్లులో యాభై శాతం తామే భ‌రిస్తామ‌ని ఆస్ప‌త్రి యాజ‌మాన్యం కూడా వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ర‌మేష్ పరిస్థితి విషమంగా ఉంది. న్యూరాలజిస్టుల ప్రత్యేక బృందం ఆయ‌న‌కు చికిత్స అందిస్తూ పర్యవేక్షిస్తోంది. ఇటీవ‌ల డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ కూడా అపోలో ఆస్ప‌త్రిలో ర‌మేష్ కుటుంబ‌స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>