నిర్మల్‌లో వైభవంగా ‘తొలి ఏకాదశి’ వేడుకలు

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని పురాతన దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ‘తొలి ఏకాదశి’ (Toli Ekadashi) వేడుకలు శనివారం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు నవీన్ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, విశేషాలంకరణలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం పంపిణీ చేశారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ నెలకొనడంతో ఆలయ పరిసరాలు భక్తి పారవశ్యంతో కళకళలాడాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>