కలం, వెబ్ డెస్క్: ప్రస్తుత సమాజంలో అమ్మాయిలపై లైంగిక వేధింపుల సంఘటనలు ఎక్కువయ్యాయి. ఈ వేధింపులను కొంత మంది అమ్మాయిలు భయపడి మౌనంగా భరిస్తే.. మరికొంత మంది అమ్మాయిలు ఎదురెల్లి ఖండిస్తున్నారు. ఇటీవల కర్ణాటకలో ఇలాంటి ఒక సంఘటన చోటుచేసుకుంది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి ఓ యువతి తగిన బుద్ధి చెప్పింది.
బెంగుళూరు (Bengaluru) లోని హెబ్బల్ నుంచి మాన్యతాకు వెళ్తున్న బస్సులో ఓ వ్యక్తి అమ్మాయిని లైంగికంగా వేధించాడు. దీంతో ఆ అమ్మాయి అతడిని చితకబాదుతూ వెంటనే ఆ విషయాన్ని డ్రైవర్‌కు చెప్పింది. స్పందించిన డ్రైవర్ వెంటనే బస్సు ఆపేసి ఆకతాయికి తగిన బుద్ధి చెప్పారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ అమ్మాయి చూపిన ధైర్య సాహసాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
బస్సులో షాకింగ్ ఘటన..!
-బెంగళూరు BMTC బస్సులో మహిళపై లైంగిక వేధింపులు
-కామాంధుడిని పట్టుకుని దేహశుద్ధి చేసిన ప్రయాణికులు… అనంతరం పోలీసులకు అప్పగింత!
Man Thrashed and Handed to Police After Harassing Woman on Bengaluru BMTC Bus#Bengaluru #BMTCBus #BengaluruBusIncident #Kalam… pic.twitter.com/Q7M4r59lI3— Kalam Daily (@kalamtelugu) July 25, 2026

