మత్తులో మాస్టారు: PTM లో షాకింగ్ సీన్!

కలం, వెబ్ డెస్క్ : అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలోని పినపాడు గిరిజన పాఠశాలలో ఒక విస్తుపోయే సంఘటన వెలుగుచూసింది. పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ-తల్లిదండ్రుల సమావేశానికి (PTM) రమణ అనే ఉపాధ్యాయుడు పూర్తిగా మద్యం సేవించి (AP Drunk Teacher) వచ్చాడు. విపరీతమైన మత్తులో ఉన్న సదరు ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్ లోని బెంచీపైనే పడిపోయాడు.

ఈ దృశ్యాలను అక్కడున్న వారు వీడియో తీయగా, ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా ప్రవర్తించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే ఇలా తాగి క్లాస్ రూమ్ లో పడిపోతే, ఇక తమ పిల్లల చదువుల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>