ప్రభుత్వ ఆసుపత్రిలో యెన్నం హెల్త్ కిట్ల పంపిణీ

కలం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో : మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని నవజాత శిశువుల తల్లులకు ‘ యెన్నం హెల్త్ కిట్లు ’ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రసవం జరిగే ప్రతి తల్లికి యెన్నం హెల్త్ కిట్ అందజేయడమే కాకుండా, వారికి హెల్త్ కార్డులను కూడా అందిస్తున్నామని తెలిపారు.

తల్లి, శిశు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. అలాగే ప్రసవానంతర సంరక్షణలో తల్లులు, శిశువులు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన సామగ్రి ఈ హెల్త్ కిట్లలో అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రంగ అజ్మీర, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>