కలం, కరీంనగర్: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు ప్రధాని మోదీ (PM Modi) కూడా రాజీనామా చేయాలని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ (బీఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు జక్కనపల్లి గణేష్ డిమాండ్ చేశారు. విద్యార్థులు, ఉద్యమకారులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లాఠీఛార్జి చేయించడం దారుణమన్నారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

