నాగర్‌కర్నూల్‌ను ‘విద్యా హబ్‌’గా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

కలం, నాగర్ కర్నూల్: చదువుతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్రంలో ప్రజలు మంచిగా చదువుకునేలా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యాశాఖ అనేక అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి (MLA Rajesh Reddy ) అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సంజయ్ నగర్ పాఠశాలను ఆయన సందర్శించారు.

అలాగే మండల పరిధిలోని పెద్దముద్దునూరు గ్రామంలో దాతల సహకారంతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను త్రిదండి రామానుజ చినజీయర్ స్వామితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే BLA ల సమావేశంలో, 16వ వార్డులో వీరనాగమ్మ పండుగలో MLA పాల్గొన్నారు.

ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ… నాగర్ కర్నూల్ ను విద్యాహబ్ గా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలను 9 కోట్లతో నూతనంగా ఆధునిక సదుపాయాలతో నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. తూడుకుర్తిలో 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. చిట్టినేని కుటుంబీకులు పెద్దముద్దునూరులో లక్షల రూపాయలతో సొంతంగా ప్రభుత్వ పాఠశాలను నిర్మించడం అభినందనీయమన్నారు.

తూడుకుర్తిలోనూ కార్పొరేట్ సంస్థ ద్వారా ప్రభుత్వ పాఠశాలను నిర్మింపచేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థుల చదువు కోసం అనేక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, దుస్తులు, కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం లాంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖను నిర్వహిస్తూ రాష్ట్రంలోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు చేపడుతున్నారని వెల్లడించారు. పేదలు చదువుకుంటేనే భవిత ఉంటుందని చెప్పారు. ప్రజలందరూ తమ పిల్లలను తప్పనిసరిగా చదివించాలని కోరారు. మంచిగా చదువుకునే విద్యార్థులకు సాయం చేసేందుకు తాను సిద్ధంగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమాల్లో మార్కెట్, మున్సిపల్ చైర్మన్లు రమణారావు, తీగల సురేంద్ర, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ జక్కా రాజ్ కుమార్, ఆయా శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>