ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. కేటీఆర్ డిమాండ్

కలం, వెబ్ డెస్క్: నీట్ పేపర్ లీక్ (NEET Paper Leak)పై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్వీ (BRSV) నిర్వహించిన నిరసనలో నల్లచొక్కా ధరించి ఆయన నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా విద్యార్థులు కదం తొక్కుతున్నారని, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గళం విప్పుతున్నారని కేంద్రంపై ఫైర్ అయ్యారు. విద్యార్థుల ఆర్తనాదాలకు మోదీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న పిల్లలపై దమనకాండ ఆపాలని.. ఢిల్లీలో పోలీసుల జులుం నశించాలని కేటీఆర్ (KTR) మండిపడ్డారు. విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలన్నారు. రాజ్యమా ఉలికిపడు అంటూ.. ఎవరితో పెట్టుకోవొద్దో వాళ్ళతోనే మోదీ పెట్టుకున్నాడని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈడీ, సీబీఐలకు భయపడి సోనమ్ వాంగ్‌చుక్ దీక్షను ఒక్క మీడియా సంస్థ కూడా చూపించలేదని అన్నారు. కానీ విద్యార్థులు సోషల్ మీడియాతో దేశాన్ని మొత్తం కదిలించారని వ్యాఖ్యానించారు.

ఢిల్లీలో విద్యార్థులు, యువతపై కేంద్ర ప్రభుత్వం అణిచివేతకు, దాష్టీకానికి పాల్పడుతోందని ఆయన ఆగ్రహించారు. మేకిన్‌ ఇండియా అడిగితే లీకిన్‌ ఇండియా ఇచ్చారని కేంద్రంపై సెటైరికల్ కామెంట్స్ చేశారు. యువత జవాబుదారీతనం కోరుతున్నారని.. 25 రోజులుగా ఢిల్లీలో పార్టీలకతీతంగా యువత పోరాడుతున్నారని చెప్పారు. విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా, విద్యార్థులకు అండగా నిలిచేందుకు ఈ నిరసన చేపట్టామని.. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని స్పష్టం చేశారు.

Read Also: బీఆర్ఎస్ తీరుపై చర్చ.. అప్పుడు అణచివేతలు.. ఇప్పుడు నీతులు?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>