ఫామ్ పాండ్ లతో భూగర్భ జలాల పెంపు : కలెక్టర్ భవేశ్ మిశ్రా

కలం, నిర్మల్​ : కుబీర్ మండలం దోడర్న గ్రామంలో జలసిరి కార్యక్రమంలో భాగంగా, ఫామ్ పాండ్ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Nirmal Collector Bhavesh Mishra) గురువారం శంకుస్థాపన చేశారు. ఫామ్ పాండ్ నిర్మాణానికి ముందుకు వచ్చిన రైతు దంపతులు గోరేకర్ సంతోష్, సాగరలను శాలువాతో సన్మానించి, అభినందించారు. వారి వ్యవసాయానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూగర్భ జలాల సంరక్షణకు ఫామ్ పాండ్ ల నిర్మాణాలు దోహదం చేస్తాయని వివరించారు. ప్రతి రైతు బాధ్యతగా తమ వ్యవసాయ క్షేత్రాల్లో ఫామ్ పాండ్ లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ఈ నిర్మాణాలకు ఆర్థిక సహాయం అందజేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువ ఉన్నాయని, ఇటువంటి నీటి నిల్వ నిర్మాణాల వల్ల అత్యవసర పరిస్థితుల్లో పంటకు నీరు అందుతుందని తెలిపారు.

భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు. రైతులు పెద్ద ఎత్తున ఫామ్ పాండ్ ల నిర్మాణానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ జలసిరి కార్యక్రమానికి సంబంధించి గోడ ప్రతులను కలెక్టర్, అధికారులు, రైతులు కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, డిఆర్డిఓ విజయలక్ష్మి, తహసిల్దార్ శ్రీదేవి, ఎంపీడీఓ శ్రీనివాస్, సర్పంచ్ జాదవ్ సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>