కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలో ఇండి కూటమి నేతల నిరసనలతో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. రాహుల్ నివాసంలో భేటీ అయిన ఇండి కూటమి నేతలు కీలక చర్చలు జరిపారు. సమావేశం అనంతరం కూటమి నేతలు (INDI Alliance Protest) రాజ్ ఘాట్ కు బయల్దేరారు. రాహుల్ నివాసం నుంచి రాజ్ ఘాట్ కు ర్యాలీగా బుస్సులో బయల్దేరి నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళులు అర్పించేందుకు సిద్ధమయ్యారు. అలాగే, కొవ్వోత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. గాయపడిన విద్యార్థులకు అండగా ఉంటామని రాహుల్ గాంధీ హామీనిచ్చారు. అలాగే, విద్యార్థుల డిమాండ్లకు తాము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు.

