కలం, వెబ్‌డెస్క్: ఢిల్లీలో జరుగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలు, పార్లమెంట్ వద్ద పోలీసుల చర్యలతో నెలకొన్న పరిస్థితులపై సుప్రీం కోర్ట్ న్యాయవాదులు (Supreme Court Lawyers) ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాజధానిలో కొనసాగుతున్న విద్యార్థుల నిరసనల నేపథ్యంలో సుప్రీం కోర్ట్ ఎదుట వినూత్న రీతిలో తమ సంఘీభావం వ్యక్తం చేశారు. సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్‌స్టిట్యూషన్ అంటూ ప్రచారం నిర్వహించారు. దీని కోసం న్యాయవాదులు ముందు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
సుప్రీంకోర్టు ప్రాంగణంలోని లాన్స్ వద్ద పలువురు భారత రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని నినదించారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. భారీ సంఖ్యలో న్యాయవాదులు ఒకే చోటుకు చేరుకొని చేపట్టిన ఈ నిరసనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also: హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్.. పాడ్ ట్యాక్సీ వచ్చేస్తోంది!
Follow Us On: Instagram

