రెండు చోట్లా ఓట్లు.. సీఎం రేవంత్ క్లారిటీ!

క‌లం, వెబ్‌డెస్క్‌: త‌న‌కు రెండు చోట్లా ఓట్లు ఉన్నాయంటూ వ‌స్తున్న వ‌దంతుల‌పై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్వ‌యంగా క్లారిటీ ఇచ్చారు. గురువారం మీడియాతో చిట్​ చాట్​గా మాట్లాడిన సీఎం ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు రెండు ఓట్లు ఉన్న‌ట్లు ఎవ‌రి ద‌గ్గ‌రైనా ఆధారాలుంటే పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసుకోచ్చ‌ని చెప్పారు. ఒక వేళ అది అబ‌ద్ధ‌మ‌ని తేలితే తాను కూడా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హెచ్చ‌రించారు. చాలామంది అవ‌గాన లేక, కొంత‌మంది కావాల‌నే ఇలాంటి ప్ర‌చారం చేస్తున్నార‌ని సీఎం మండిప‌డ్డారు.

తాను క‌లెక్ట‌ర్ అనుమ‌తి తీసుకొని త‌న గ్రామంలో ఉన్న ఓటును కొడంగ‌ల్‌కు (Kodangal) మార్చుకున్న‌ట్లు తెలిపారు. గతంలో కొడంగల్ ప్రాంతం కర్ణాటకలోని జిల్లాలో ఉండేద‌ని, భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అనంత‌రం కొడంగల్ పాలమూరు జిల్లాలోకి వచ్చింద‌ని వెల్లడించారు. అందుకే తన ఓటు హక్కును కొడంగల్​కు మార్చుకున్నట్లు వివరించారు.

Read Also: హరీష్ రావుకి రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>