పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో హై టెన్ష‌న్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: పార్ల‌మెంట్ (Parliament) ఆవ‌ర‌ణ‌లో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. నీట్ పేప‌ర్ లీక్‌ (NEET Paper Leak) పై చ‌ర్చ నేప‌థ్యంలో అధికార‌, విప‌క్షాల మ‌ధ్య స‌భ‌లో తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. అనంత‌రం స్పీక‌ర్‌ స‌భ‌ను మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు వాయిదా వేశారు. కేంద్ర హోం మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ విప‌క్ష స‌భ్యులు పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో నిర‌స‌న‌కు దిగారు.

ఎన్డీఏ, యూపీఏ ఎంపీలు పోటాపోటీగా ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తున్నారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పార్ల‌మెంట్ భ‌ద్ర‌తా సిబ్బంది భారీ ఎత్తున మోహ‌రించారు. నిరసనల్లో కాంగ్రెస్​ చీఫ్​ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ, ప్రియాంకా సహా ఇండియా కూటమి ఎంపీలు సైతం పాల్గొన్నారు. ధ‌ర్మేంద్ర (Dharmendra Pradhan) రాజీనామా చేయాల‌ని, నీట్ పేప‌ర్ లీక్‌పై స‌భ‌లో చ‌ర్చ జ‌ర‌గాల‌ని ప్ర‌తిప‌క్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. మ‌రోవైపు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ యువ‌త‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని, ప్ర‌ధాని ఇంటిపై దాడికి య‌త్నించ‌డం సిగ్గుచేట‌ని ఎన్డీఏ ఎంపీలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Read Also: హైడ్రా కమిషనర్ ను అరెస్టు చేయండి : హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>