సీఎం రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు.. కేటీఆర్ వార్నింగ్!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్రంగా స్పందించారు. గ్లోబరీనా టెక్నాలజీస్ (Globarena Technologies) సంస్థతో తనకు కానీ, తన కుటుంబానికి లేదా బీఆర్ఎస్ పార్టీకి కానీ ఎలాంటి సంబంధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదానికి సంబంధించి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ లీగల్ టీమ్ త్వరలోనే నోటీసులు పంపనుందని కేటీఆర్ వెల్లడించారు.

ముఖ్యమంత్రి చేస్తున్న నిరాధారమైన, అనుచితమైన ఆరోపణలకు చాలాసార్లు తాను స్పందించకపోవడానికి కారణం అవి పూర్తిగా అసంబద్ధమైనవి కావడమేనని వివరించారు. తన నిశ్శబ్దాన్ని అంగీకారంగా భావించవద్దని, బురద చల్లే రాజకీయాల్లో పాల్గొనడం ఇష్టం లేకే ఇప్పటివరకు మౌనంగా ఉన్నానని కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు. పేపర్ లీకేజీల వంటి సున్నితమైన అంశాలపై ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అబద్ధాలను ప్రచారం చేయడం, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం శోచనీయమని కేటీఆర్ విమర్శించారు. కనీసం ఒక్కసారైనా ముఖ్యమంత్రిలా ప్రవర్తించాలని కేటీఆర్ విమర్శించారు.

Read Also: హైడ్రా కమిషనర్ ను అరెస్టు చేయండి : హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>