గిగ్ వర్కర్ల సమస్యలు తీర్చాలి.. సర్కార్‌కు కవిత హెచ్చరిక

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో గిగ్ వర్కర్ల సమస్యలపై (Gig Workers Issues) తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) గళం విప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని గిగ్ కార్మికుల సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు. గిగ్ వర్కర్లు, డ్రైవర్లను అగ్రిగేటర్ సంస్థలు మోసం చేస్తున్నాయని.. రేవంత్ సర్కార్ వెంటనే జోక్యం చేసుకోని అగ్రిగేటర్ సంస్థలతో మాట్లాడి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలన్నారు. స్విగ్గీ, జొమాటో, ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాది గిగ్ వర్కర్లు, డ్రైవర్లు రోజంతా కష్టపడినా వారి ఆదాయం కుటుంబాన్ని పోషించుకునేందుకు కూడా సరిపోవడం లేదని అన్నారు.

అగ్రిగేటర్ సంస్థలు వారికి సరిపడా ఆదాయం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అగ్రిగేటర్స్ సంస్థలతో మాట్లాడి గిగ్ వర్కర్లకు, క్యాబ్ డ్రైవర్లకు ఛార్జీలు పెంచేలా చర్యలు తీసుకోవాని వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. గిగ్ వర్కర్లు, డ్రైవర్లకు తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని భరోసా కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్ల వైపు ఉండి వాళ్ల సమస్యలు వెంటనే తీర్చాలని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>