కలం, మహబూబ్నగర్ బ్యూరో: ఆల్ ఇండియా తంజీమ్-ఎ-ఇన్సాఫ్ (All India Tanzeem-E-Insaaf) మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా నూతన కౌన్సిల్ను బుధవారం ఎన్నుకున్నారు. సీపీఐ నాయకులు సత్యనారాయణ రెడ్డి సమక్షంలో 15 మంది సభ్యులతో ఈ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యక్షునిగా రహమత్ ఖాన్, ప్రధాన కార్యదర్శిగా ఎండి నవాజ్, ఉపాధ్యక్షులుగా ఖాజా మొయినుద్దీన్, సహాయ కార్యదర్శిగా ఎంఏ హమీద్, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎండి ముక్తార్, కార్యవర్గ సభ్యునిగా అబ్దుల్లా షేక్, కౌన్సిల్ సభ్యునిగా తన్వీర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

