వర్షాకాల అప్రమత్తత.. హోటళ్లు, పండ్ల దుకాణాల్లో తనిఖీలు

కలం, నిర్మల్ : వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పండ్ల దుకాణాలు, హోటళ్లు, స్వీట్ హోమ్‌లను పరిశీలించి పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులకు సూచించారు.

ఆహార పదార్థాలను పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేసి, నిల్వ చేసి విక్రయించాలని, వినియోగదారుల ఆరోగ్యంతో రాజీ పడొద్దని అధికారులు హెచ్చరించారు. ప్రతి వ్యాపార సంస్థ తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సునీత, సానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>