వంటి మామిడి మార్కెట్ యార్డులో వినూత్న నిరసన

కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండల పరిధిలోని వంటి మామిడి మార్కెట్ యార్డు (Vantimamidi Market Yard) లో కనీస సౌకర్యాలు లేక రైతులు పడుతున్నారని బీజేపీ నాయకులు రైతులతో కలిసి బురదలోనే వరి నాట్లు వేసి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా వినూత్నంగా నిరసన తెలిపారు.

​చిన్నపాటి వర్షం కురిసినా మార్కెట్ ప్రాంగణమంతా నీరు చేరి తీవ్ర బురదమయంగా మారుతోందని , దీనివల్ల మార్కెట్‌కు పంటను తీసుకొచ్చే రైతులు, కొనుగోలు చేయడానికి వచ్చే వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. బురదలోనే నిలబడి పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

​మార్కెట్ యార్డులో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం అధికారుల, పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని, రైతులకు అవసరమైన కనీస వసతులు లేవని బీజేపీ నాయకులు మండిపడ్డారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>